తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పుట్టింది. హీరో విజయ్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం.. సింపుల్ గా టీవీకే విజయ్ అంటూ పిలుస్తున్నారు. పార్టీ పేరును ఫిబ్రవరి 2వ తేదీ అధికారికంగా ప్రకటించారు. రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటానని.. సిల్లీ పాలిటిక్స్ చేయనని చాలా స్ట్రాంగ్ గానే లేఖ విడుదల చేశారు హీరో విజయ్.
Also read :- రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్ ఆస్తులు ఎంత..!
రాబోయే ఎన్నికలపైనా స్పందించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని.. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని వెల్లడించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తుందని.. అప్పటి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టబోతున్నట్లు వెల్లడించారు విజయ్.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay pic.twitter.com/ShwpbxNvuM
— TVK Vijay (@tvkvijayoffl) February 2, 2024
విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాలపై తన సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో అభిమాన సంఘాలు ఉన్న ఏకైక హీరో విజయ్. ప్రతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో.. తన దైన స్టయిల్ లో తన అభిమాన సంఘాలకు హింట్ ఇస్తూ వస్తారు విజయ్. ఓసారి సైకిల్ పై వెళ్లి ఓటు వేశారు.. ఇలా రాజకీయ పార్టీలకు తన అభిమాన సంఘాల ద్వారా షాక్ ఇస్తూ వస్తుంటారు విజయ్. 2026లో తమిళనాడులో అసలు సిసలు పొలిటికల్ గేమ్ జరగటం ఖాయం..