
తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రముఖ నటి పావని రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య పావని రెడ్డి తెలుగులో కంటే ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీపై ద్రుష్టి సారిస్తోంది. ఈ క్రమంలో వరుస సీరియల్, సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది. అంతేకాదు తమిళ్ బిగ్ బాస్ 5వ్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా నిలిచింది.
అయితే నటి పావని రెడ్డి మళ్ళీ వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెండో పెళ్లికి రెడీ అవుతోంది. తనతో పాటు బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కొరియోగ్రాఫర్ అమీర్ తో ప్రేమలో పడింది. దీంతో కొన్ని రోజులుగా డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే వీరి ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏప్రిల్ 20న వివాహం చేసుకోబోతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా పావని రెడ్డికి గతంలో ప్రదీప్ కుమార్ అనే తెలుగు నటుడితో వివాహం జరిగింది. కానీ పెళ్లయిన ఏడాదికే ప్రదీప్ఆ కుమార్ హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రదీప్ కుమార్ కేసుని పోలీసులు విచారించినప్పటికీ మృతికి గలకారణాలు ఏంటనేది మాత్రం బయటికి రాలేదు. ఆ తర్వాత పావని రెడ్డి టాలీవుడ్ ని వదిలిపెట్టి కోలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యింది.