విజయ్ 69వ మూవీ అప్డేట్... డైరెక్టర్ ఎవరంటే..?

విజయ్ 69వ మూవీ అప్డేట్... డైరెక్టర్ ఎవరంటే..?

తమిళ ప్రముఖ హీరో తళపతి విజయ్ కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ మధ్యకాలంలో విజయ్ సినిమాలు తమిళ్ తోపాటూ, తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవలే విజయ్ హీరోగా నటించిన గోట్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది. దీంతో విజయ్ అభిమానులు కొంతమేర నిరాశ చెందారని చెప్పవచ్చు. 

విజయ్ ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు విజయ్ 69వ చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ చిత్ర అప్డేట్ ని ప్రకటించారు. ఇందులో భాగంగా విజయ్ 69వ చిత్రానికి గతంలో వలిమై, ఖాకీ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ చిత్రానికి తమిళ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.  

అయితే ఈ పోస్టర్ లో వెలిగించిన కాగడాతోపాటూ "టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసి" అని రాసి ఉంది. దీన్నిబట్టిచూస్తే సమాజం కోసం మెసేజ్ ఓరియెంటెడ్ లేదా విభిన్న ప్రయోగం చేయ్యబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.