యంగ్ హీరోయిన్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ డేటింగ్..?

యంగ్ హీరోయిన్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ డేటింగ్..?

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ సినిమాలతో అలరించే శ్రీకాంత్ అడ్డాల గురించి నెట్టింట్లో ఓ వార్త  తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, తమిళ్ యంగ్ హీరోయిన్ బ్రిగిడా సాగాతో ప్రేమలో పడ్డాడని, డేటింగ్ కూడా చేస్తున్నారని పలు రూమర్లు, గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తమిళ్ డైరెక్టర్, నటుడు పార్తీబన్ ఓ ఇంటర్వూలో స్పందించాడు. 

ఇందులోభాగంగా పార్తీబన్ "డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, హీరోయిన్ బ్రిగిడా సాగాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తనకి తెలియదని కానీ ఆమె మంచి నటి అని తెలిపాడు. అలాగే తాను ఇండస్ట్రీకి హీరోయిన్స్ గ పరిచయం చేసినవారిలో బ్రిగిడా సాగా కూడా ఒకరని ఆ అమ్మాయి మంచి టాలెంటెడ్ యాక్టర్ అని కితాబిచ్చాచ్చాడు. బ్రిగిడా సాగా కి హీరోయిన్ గ మంచి ఫ్యూచర్ ఉంది.. ఈ సమయంలో ప్రేమ, డేటింగ్ అంటూ కెరీర్ ని స్పాయిల్ చేసుకోదని తానూ అనుకుంటున్నట్లు పార్తీబన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు."

అయితే బ్రిగిడా సాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన పెదకాపు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీరిద్దరి లవ్, డేటింగ్ వ్యవహారంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే సినిమాలో కలసి పని చేసినంతమాత్రాన తమ మధ్య ఎదో ఉందంటూ ప్రచారాలు చెయ్యడం సరికాదని అంటున్నారు. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చెయ్యడంవలన నటీనటుల కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెదకాపు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. అంతేకాకుండా టాలీవుడ్ కి చెందిన మరో స్టార్ హీరోతో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక బ్రిగిడా సాగా గత ఏడాది తమిళ్ ప్రముఖ డైరెక్టర్ N.R. రఘునాథన్ డైరెక్ట్  చేసిన కోజిపన్నై చెల్లదురై(kozhipannai chelladurai) అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బ్రిగిడా సాగా కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం..