విడాకులకోసం కోర్టుకెళ్లిన డైరెక్టర్.. పెళ్లయిన 17 ఏళ్ళ తర్వాత విడిపోతున్నట్లు ప్రకటన..

విడాకులకోసం కోర్టుకెళ్లిన డైరెక్టర్.. పెళ్లయిన 17 ఏళ్ళ తర్వాత విడిపోతున్నట్లు ప్రకటన..

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శీను రామసామి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే శీను రామసామి తమిళ్ లో 2010లో వచ్చిన "తెన్మెర్కు పరువుకాట్రు" అనే సినిమా ద్వారా కెరీర్ ని ఆరంభించాడు. అంతేగాకుండా ఈ సినిమాకి శీను రామసామి దర్శకత్వం వహించడంతోపాటూ డాక్టర్ పాత్రలో కూడా నటించాడు. దీంతో శీను రామసామి కి నేషనల్ అవార్డు కూడా లభించింది.

అయితే శీను రామసామి "తన భార్య జీ.ఎస్ దర్శనతో 17 ఏళ్ళ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికాము. అలాగే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నామని తెలిపాడు. అలాగే ఈ విడాకుల నిర్ణయం ఇరువురి వ్యక్తిగత జీవితాలపై, కార్యకలాపాలపై ప్రభావం చూపదని ఒకరికొకరు తెలుసుకున్నాము. విడాకులు విషయంలో మాకు సహాయం చెయ్యాలని చెన్నై హైకోర్టుని సంప్రదించాము. అలాగే మా వ్యక్తిగత నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని మేము ఆశిస్తున్నామని" ట్వీట్ చేశాడు. దీంతో ఈ విషయం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హత టాపిక్ గా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు శీను రామసామి తన కెరీర్ లో విజయ్ సేతుపతితో 3 సినిమాలు తీశాడు. అలాగే ప్రముఖ హీరో, తమిళ్ నాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో ఒక సినిమా తెరకెక్కించాడు. అయితే శీను రామసామి తన కుటుంబానికి సంబందించిన వివరాల్ని గోప్యంగా ఉంచడంతో  జీ.ఎస్ దర్శన గురించి పెద్దగా వివరాలు తెలియలేదు.