ఇకపై ఆ ఛాన్స్ లేదు: థియేటర్ల ప్రాంగణంలో వారికి నో ఎంట్రీ.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం

ఇకపై ఆ ఛాన్స్ లేదు: థియేటర్ల ప్రాంగణంలో వారికి నో ఎంట్రీ.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం

కష్టపడి సినిమాలు తెరకెక్కించి.. తీరా రిలీజ్ అయ్యాక.. నెటిజన్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూస్ తో సినిమా ఫలితం డిసైడ్ అయ్యే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు వచ్చాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఇకపై థియేటర్ల ప్రాంగణాల్లోకి యూట్యూబ్‌ ఛానల్స్‌కు నో ఎంట్రీ అని కోలీవుడ్‌ నిర్మాతల మండలి (TFAPA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఎక్స్‌ వేదికగా బుధవారం నవంబర్ 20న ప్రకటించింది. 

‘‘ఈ ఏడాది 2024లో రిలీజైన మూవీస్ పై యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చుపించాయి. అందులో ముఖ్యంగా 'ఇండియన్‌ 2, వేట్టయన్‌, కంగువ సినిమాల రిజల్ట్స్ పై ఎంతో డ్యామేజ్ జరిగినట్లు లేఖలో తెలిపారు. రానురాను ఇలాగే కొనసాగితే సినిమా పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతోందని.. దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి.. పరిశ్రమ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా థియేటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో సమయంలో థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటివాటికి పాల్పడితే అంగీకరించేది లేదని' TFAPA హెచ్చరించింది.