రూ. 2వేల కోట్ల డ్రగ్స్ కేసులో తమిళ నిర్మాత అరెస్ట్..

న్యూఢిల్లీ: రూ.2వేల కోట్ల డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలతో తమిళ సిని ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, నార్కోటిక్స కంట్రోల్ బోర్డు  శనివారం (మార్చి 09) అరెస్ట్ చేశారు. అంతకుముందు అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ను ఛేదించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ స్పెషల్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 

వారి నుంచి మత్తు పదార్థాలను తయరు చేసే రసాయనాలను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులనుంచి 50 కిలోల సూడోపెడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. హెల్త్ మిక్స్ పౌడర్ డెసికేటెడ్ కొబ్బరి వంటి ఆహార ఉత్పత్తు్లలో దాచి సముద్ర మార్గాన, ఎయిర్ లైన్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. 

న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియన్ పోలీసుల నుంచి రెండు దేశాలకు పెద్ద మొత్తంలో సూడోఎఫెడ్రిన్ సరఫరా అవుతున్నట్లు సమాచారం అందడంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.