
తమిళ సినీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు రెండ్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో హీరోలు ధనుశ్(Danush), శింబు(Simbu), విశాల్(Vishal), అథర్వ మురళి(Adarwa murali) లపై నిషేధం విధించింది. ఇకపై ఈ నలుగురు హీరోలు సినిమాల్లో నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
హీరో శింబు విషయంలో నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదం కారణంగా.. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలతో విశాల్ కు.. తెనందాల్ నిర్మాణ సంస్థలో చేసిన సినిమాకు సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినందువల్ల ధనుష్ కు.. మదియలకన్ నిర్మాణ సంస్థతో ఒక సినిమాను ఓకే చేసి షూటింగ్ సమయంలో సహకరించలేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read :- స్టార్ హీరో సూర్యను ఢీ కొట్టడానికి.. రెడీ అంటున్న తమన్నా బాయ్ఫ్రెండ్
ఈ నలుగురితో పాటు.. నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు కూడా రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం నిర్ణయించింది. ఏ లిస్టులో నటుడు దర్శకుడు ఎస్జే సూర్య, నటుడు విజయ్ సేతుపతి, నటి అమలా పాల్, కమెడియన్ వడివేలు, నటి ఊర్వశి, నటి సోనియా అగర్వాల్ తోసహా 14 మంది నటీనటులు ఉన్నారని సమాచారం.