Vishal vs TFPC: టీఎఫ్‌పీసీ-విశాల్ మధ్య మాటల యుద్దం..సినిమాలు చేస్తూనే ఉంటా..దమ్ముంటే ఆపుకోండి

Vishal vs TFPC: టీఎఫ్‌పీసీ-విశాల్ మధ్య మాటల యుద్దం..సినిమాలు చేస్తూనే ఉంటా..దమ్ముంటే ఆపుకోండి

తనదైన నటనతో తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు హీరో విశాల్(Vishal). ఆయన తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అలాంటి నటుడిపై నిర్మాతల మండలి బ్యాన్ విధించడం పట్ల తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. 

తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (TFPC), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. 

గతంలో హీరో విశాల్ నిర్మాతల మండలికి (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన దాదాపు రూ.12 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ ప్రస్తుత నిర్మాతల మండలి నుంచి ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా తన సినిమాల రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవడమేంటని తమిళనాడు ప్రభుత్వంపై విశాల్‌ కొన్ని రోజుల క్రితం ఫైర్ అయ్యారు. దాంతో టీఎఫ్‌పీసీ టార్గెట్‌ చేస్తూ విశాల్ పై, ఆయన నటించిన సినిమాలపై  కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు ఎవ్వరూ చేయకూడదని నిర్మాతల మండలి అల్టిమేటం కూడా జారీ చేసింది.

తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్ స్పందిస్తూ ట్విట్టర్ X లో పోస్ట్ చేశాడు. "‘మిస్టర్ కథిరేశన్ (విశాల్ టీమ్ లోని వ్యక్తి )..మనమందరం సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాల గురించి మీకు తెలియదా? విద్య, వైద్య బీమా మరియు నిర్మాతల మండలిలోని వృద్ధుల/ కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేశాం. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ముందు మీరు మీ పని సక్రమంగా చేయండి. థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్, డబుల్ టాక్సేషన్ వంటి సమస్యలు ఉన్నాయి. ముందు వాటిపై సక్రమమైన దృష్టి పెట్టండి. విశాల్ ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు.మీకు వీలైతే నన్ను ఆపడానికి ట్రై చేయండి. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా?’ అంటూ విశాల్ ఫైర్ అయ్యారు విశాల్.

ఇటీవలే రత్నం మూవీ రిలీజ్ టైంలో విశాల్ తనకు ఎదురవుతున్న సమస్యలను పంచుకున్నారు. కావాలనే తన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమిళ ఇండస్ట్రీలో తనను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నష్టాల గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని జిల్లాల్లో తన సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదని, నా సినిమాలకు నష్టం జరిగేలా చేస్తే.. ఎవరినీ వదిలిపెట్టనని, చట్టపరంగా పోరాటం చేస్తానాని మండిపడ్డారు. ఇక ఇప్పుడు మళ్ళీ మొదలైన ఈ ఇస్స్యూ ఎంతవరకు వెళుతుందో చూడాలి.