
డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తమిళ హీరో అరుణ్ విజయ్, త్వరలో ‘ఆక్రోశం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జి.యన్.ఆర్.కుమారవేలన్ దర్శకుడు. సీహెచ్ సతీష్ కుమార్, ఆర్.విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించాం. తమిళంలో ‘సినం’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకముంది’ అన్నారు. అరుణ్ విజయ్‌కి జంటగా పల్లక్ లల్వాని నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి ఇతర పాత్రల్లో నటించారు. షబీర్ తబరే ఆలం సంగీతం అందించారు.