Jayam Ravi: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్ ?.. ఫొటోస్ డిలీట్

Jayam Ravi: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్ ?.. ఫొటోస్ డిలీట్

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) తన భార్య ఆర్తి(Arthi) నుండి విడాకులు తీసుకోబోతున్నాడు? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కారణం.. ఈ ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ఫోటోలను డిలీట్ చేశారు. దాంతో.. ఈ జంట కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

అయితే.. ఈ మధ్య చాలా మంది స్టార్ కపుల్ ఇలాగే విడిపోవడానికి ముందు తమ తమ సోషల్ మీడియాలో పాత ఫోటోలను డిలీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జయం రవి, ఆర్తి కూడా పాత ఫోటోలను డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఈ జంట కూడా విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. 

Also Read:Kalki 2898 AD Sequel: కల్కి 3102 BC.. శ్రీకృష్ణావతారం ముగింపు కథతో సీక్వెల్

ఇక జయం రవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇదే సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది.