
తమిళ హీరో శింబు 48వ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బ్లడ్ అండ్ బ్యాటిల్’ ట్యాగ్‌లైన్‌తో ఓ వీడియో ద్వారా ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మంచి చిత్రాలు నిర్మించడమే మా లక్ష్యం. గత నలభై ఏళ్లుగా 56 సినిమాలు చేశాం. శింబు, దేశింగ్ పెరియసామి టీమ్‌కి ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. శింబు మాట్లాడుతూ ‘కమల్ సర్ బ్యానర్‌లో నటించడం గొప్ప గౌరవం. ఈ సినిమా నా కెరీర్‌లో మైలు రాయిగా నిలుస్తుంది’ అన్నాడు. ఈ ప్రాజెక్ట్ తనకెంతో స్పెషల్ అన్నాడు పెరియసామి. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుందని మరో నిర్మాత ఆర్.మహేంద్రన్ చెప్పారు.