రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ యాక్ట్ చేసిన ‘బీస్ట్’ మూవీ లోని ‘అరబిక్ కుతు’ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. కేవలం 12 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడమే కాకుండా..3.7 మిలియన్స్ కు పైగా లైక్స్ సాధించి దుమ్మరేపుతోంది. రిలీజైన 4 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌, వారం రోజుల్లోనే 70 మిలియన్‌ వ్యూస్‌ కొల్లగొట్టిన ఈ సాంగ్.. ఇప్పడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాకు భాషతో సంబంధం లేదని రుజువు చేసింది. యంగ్ సెన్సెషన్ అనిరుధ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కు జానీ మాస్టర్ బ్యూటీఫుల్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. అనిరుధ్, జోనితా గాంధీ పాడిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బీస్ట్ సినిమా ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.  

మరిన్ని వార్తల కోసం:

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది