Vijay Sethupathi: కథలు అద్భుతం.. అందుకే తెలుగు సినిమాలు చేయడంలేదు: విజయ్ సేతుపతి

Vijay Sethupathi: కథలు అద్భుతం.. అందుకే తెలుగు సినిమాలు చేయడంలేదు: విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక్కడి కథలు, సినిమాలు అద్భుతమని, కానీ, ఆ కారణంగా తెలుగులో సినిమాలు చేయడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోవడంపై విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కోసం మునుపెన్నడూ లేని విదంగా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు విజయ్ సేతుపతి. దాంతో.. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. ఇందులో భాగంగా తాజాగా  ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి ఈ మధ్య తెలుగు సినిమాలు చేయకపోవడం గురించి ప్రశ్నించారు.

దానికి సమాధానంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలు చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగానే ఉన్నాను. చాలా కథలు కూడా విన్నాను, కొన్ని చాలా నచ్చాయి కూడా. కానీ, ఆ కథల్లో నాకు ఇచ్చిన పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. కథలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. వాళ్ళు ఆఫర్‌ చేస్తున్న పాత్రలు నాకు సెట్‌ కాకపోవడం కారణంగానే తెలుగులో సినిమాలు చేయడం లేదు. త్వరలోనే అలాంటి పాత్రలు ఇక్కడ దొరుకుతాయని ఆశిస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.