Vijay: పొలిటికల్ గేర్ మార్చిన విజయ్.. చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్..

Vijay: పొలిటికల్ గేర్ మార్చిన విజయ్..  చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్..

తమిళనాడును తేలిగ్గా తీసుకోవద్దని.. చాలా రాష్ట్రాలకు చుక్కలు చూపిన చరిత్ర తమదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో పార్లమెంటుకు, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఇక్కడ పాగా వేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నా రని ఆరోపించారు. కానీ తమిళనాడును హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జా గ్రత్తగా ఉండాలని సూచించారు. 

ఇవాళ చెన్నై తిరువన్మయూర్లో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడంతో పాటు వక్స్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. 'డీలి మిటేషన్తో బీజేపీ కుట్రలు ఏంటో తెలుస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం పార్లమెంటులో తమిళనాడు ప్రాధాన్యం తగ్గించాలని చూస్తోంది. తమిళనాడులో పరిపాలన గురించి మాట్లాడితే అధికార పార్టీకి ఎందుకు అంత కోసం వస్తుంది? రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న అరాచకాల గురించైతే నేనింకా మాట్లాడలేను. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్ని కల్లో ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే పార్టీల మధ్యనే ఉంటుంది' అని తెలిపారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ 'జన నాయగన్' (తెలుగులో జన నాయకుడు) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తుండగా మామితా బైజు, పూజ హెగ్డే, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత హీరో విజయ్ పూర్తిగా సినిమాలకి స్వస్తి చెప్పి ఫుల్ టైమ్ పొలిటిషీయన్ గా మారనున్నాడు. అందుకే ముందస్తు ప్లానింగ్ గా తాను స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని బలోపేతం చేస్తున్నాడు.