నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ, తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుంటుంది నిత్యామీనన్. తను ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం కనిపిస్తుంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే నిత్యా.. తాజాగా ఓ తమిళ చిత్రానికి సైన్ చేసింది. ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్థన్ అసిస్టెంట్ కామిని ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. బి.జి.ఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రాంకీ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిత్యా మీనన్ లుక్ ఆకట్టుకుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో ప్రేమలో విఫలమైన అబ్బాయిలను చూశారు. అందుకు భిన్నంగా ప్రేమలో విఫలమైన ఓ అమ్మాయి కథ ఇది. ఆమె రిలేషన్‌షిప్స్‌ను, తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ను తన కోణంలో చూడబోతున్నారని మేకర్స్ తెలియజేశారు. వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.