తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ 

న్యూఢిల్లీ: తమిళనాడు ఎంపీ కె. గోపీనాథ్ ఎంపీగా తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. దేశంలో ప్రధానంగా ఎక్కువగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ భాషల పట్ల స్థానికులకు ఎంతో ప్రేమ.ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సొంత భాషంటే ఎక్కువ మక్కువ చూపుతారు. తమిళనాడు ప్రజలైతే తమ భాష కు ఇచ్చిన ప్రాధాన్యత మరేభాషకు ఇవ్వరు. అందుకే ఇంగ్లీష్ , హిందీ నేర్చుకునేందుకు నిరాకరించారు కూడా. ఇలాంటి సందర్భాల్లో ఒక తమిళ ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారు. ఎందుకు అలా చేశారో తెలుసుకుందాం.. 

తమిళనాడుకు చెందిన లోక్ సభ ఎంపీ కే. గోపీనాధ్ లోక్ సభలో తెలుగులో ప్రమాణం చేశారు. దీంతో సభికులంతా ఆశ్చర్యపోయారు. తమిళనాడులోని కృష్ణ గిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ గా గెలిచిన కే. గోపీనాధ్.. జూన్ 25 , 2024న స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. సభకు నమస్కారం. అంటూ తెలుగులో  ప్రమాణాన్ని మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం మొత్తం తెలుగులోని చేశారు. అయితే చివర్లో నండ్రి , వణక్కం, జై తమిళనాడు అంటూ తమిళంతో ముగించారు. 

అయితే కే. గోపీనాధ్ తమిళంలో కాకుండా తెలుగులో ప్రమాణం చేయడానికి ఓ ప్రత్యే కమైన కారణం ఉంది.. ఎందుకంటే ఆయేన మాతృభాష తెలుగు కాబట్టి..ఆయన తమిళనాడులో స్థిరపడిన తెలుగువాడు కాబట్టి.. 

గోపీనాధ్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. తమిళనాడులోని హోసూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006, 2011 వరుసగా గెలిచిన గోపీనాథ్, ఈ సారి కృష్ణ గిరి లోక్ సభ స్థనం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు.తమిళనాడులోని కృష్ణగిరి, హోసూర్ ఏపీ సరిహద్దుల్లో ఉంటాయి.  ఈ రెండు సెగ్మెంట్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు.