
చెన్నై: తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ తన వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య సైంధవి నుంచి విడాకులు కోరుతూ ఇవాళ (మార్చి 24న) చెన్నై ఫ్యామిలీ కోర్టుకు జీవీ ప్రకాశ్ వెళ్లాడు.
సైంధవి, జీవీ ప్రకాశ్ పరస్పర అంగీకారంతోనే విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమకు విడాకులు మంజూరు చేయాలని ఇవాళ చెన్నై ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి జీవీ ప్రకాశ్, సైంధవి పిటిషన్ దాఖలు చేశారు. చిన్న నాటి స్నేహితులైన జీవీ ప్రకాశ్, సైంధవి 2013లో వివాహం చేసుకున్నారు. తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది (2024) ప్రకటించారు. జీవీ ప్రకాశ్, సైంధవికి 2020లో పాప పుట్టింది.
இசையமைப்பாளர் ஜி.வி பிரகாஷ் - பாடகி சைந்தவி ஆகியோர் பரஸ்பரம் விவாகரத்து கோரி குடும்ப நல நீதிமன்றத்தை நாடிய நிலையில், வழக்கு விசாரணையை நீதிபதி செல்வ சுந்தரி ஒத்திவைப்பதாக அறிவித்தார். இதையடுத்து நீதிமன்றத்திலிருந்து ஒரே காரில் இருவரும் புறப்பட்டுச் சென்றனர். #GVPrakash #Saindhavi pic.twitter.com/kOp7QyVoM6
— Idam valam (@Idam_valam) March 24, 2025
12 ఏళ్ల పాటు జీవీ ప్రకాశ్, సైంధవి వైవాహిక బంధంలో కొనసాగారు. అభిప్రాయ భేదాల కారణంగా ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు, మూడేళ్ల నుంచే జీవీ ప్రకాశ్, సైంధవి ఎవరికి వారే యమునా తీరే తరహాలో విడివిడిగా ఉంటున్నట్లు తెలిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు జడ్జి సెల్వ సుందరి ఈ కేసును వాయిదా వేయడంతో జీవీ ప్రకాశ్, సైంధవి ఒకే కారులో కోర్టు నుంచి వెళ్లిపోయారు.
స్వచ్ఛందంగా విడిపోతున్నట్లు జడ్జికి స్పష్టం చేసేందుకే జీవీ, సైంధవి చెన్నై ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. 2024లో ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు పుకార్లు షికారు చేశాయి. కొన్ని రోజుల తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి సోషల్ మీడియాలో ప్రకటిచండంతో ఆ పుకార్లే నిజమయ్యాయి.
ఇండియాలోనే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడే ఈ జీవీ ప్రకాశ్ కుమార్. 1992లో శంకర్ డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాతో జీవీ ప్రకాశ్ సింగింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశాడు.
తెలుగులో జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎప్పటికీ అలరించే పాటలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో రీసెంట్గా నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు కూడా జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చాడు.
ఈ మధ్య చాలా తెలుగు సినిమాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. నటుడిగా కూడా జీవీ ప్రకాశ్ పలు సినిమాల్లో నటించాడు. మార్చి 7న విడుదలైన ‘కింగ్ స్టన్’ సినిమాలో హీరో, సంగీతం, నిర్మాత కూడా జీవీ ప్రకాశే కావడం గమనార్హం. జీవీ ప్రకాశ్ భార్య సైంధవి కూడా సింగర్.