Tamil Nadu: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

Tamil Nadu:  బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. విరుదు నగర్ జిల్లా సత్తూరులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 8మందికి గాయాలయ్యాయి.పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 

Also Read :- యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

 ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.   ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటకు వెలికి తీశారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటానా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.