తమిళనాడులో బస్సు,కారు ఢీ..చెలరేగిన మంటలు.. ఐదుగురు మంటల్లో కాలిపోయారు

తమిళనాడులో బస్సు,కారు ఢీ..చెలరేగిన మంటలు.. ఐదుగురు మంటల్లో కాలిపోయారు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 26) తెల్లవారు జామున కరూర్ జిల్లా కుళితలై హైవే పై బస్సు,  కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. 

కారులో ప్రయాణిస్తున్న ఒకేకుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్ సజీవదహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. కారులో ఉన్న మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టమ్కు తరలించారు. 

ఒరతనాడులోని కీలైయూర్ లోని అగ్నివీరనార్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కోయంబత్తూర్ లోని కునియముత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలుఉన్నారు.