ముంబై/నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు బ్యాటింగ్‌లో తడబడింది. ముంబైతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లలో 146 రన్స్‌కే ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) మాత్రమే రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడును ముంబై బౌలర్లు మోహిత్ (3/24), శార్దూల్ (2/48), ముషీర్ ఖాన్ (2/18), తనుష్ (2/10) ఆరంభం నుంచే కట్టడి చేశారు.
దాంతో సాయి సుదర్శన్ (0), జగదీశన్ (4), ప్రదోష్ రంజన్ (8), సాయి కిశోర్ (1), బాబా ఇంద్రజిత్ (11) ఫెయిలయ్యారు. విజయ్, సుందర్ ఆరో వికెట్‌కు 48 రన్స్ జోడించి స్కోరు వంద దాటించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 45/2 స్కోరు చేసింది. ముషీర్ ఖాన్ (24 బ్యాటింగ్), మోహిత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పృథ్వీ షా (5), భూపేన్ లాల్వాణి (15) నిరాశపర్చారు.
ఆవేశ్ ఖాన్ సూపర్..
మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో విదర్భతొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63), అథర్వ థైడ్ (39) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌటయ్యారు. ఆవేశ్ ఖాన్ (4/49) నాలుగు వికెట్లతో విదర్భ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. కుల్వంత్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లతో అండగా నిలిచారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 47/1 స్కోరు చేసింది. హిమాన్షు మంత్రి (26 బ్యాటింగ్), హర్ష్ గావ్లి (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.