Video Viral: భలేగా కాపాడావయ్యా... వీడు కండక్టర్​కాదు..  పాసింజర్​ ప్రాణాలను రక్షించాడు..

Video Viral: భలేగా కాపాడావయ్యా... వీడు కండక్టర్​కాదు..  పాసింజర్​ ప్రాణాలను రక్షించాడు..

ప్రపంచంలో  సోషల్​ మీడియా రాజ్యం ఏలుతుంది.  ఏ విషయం జరిగినా క్షణాల్లో వైరల్​ అవుతుంది.  అది ఎవరు చేసినా జనాలకు చేరడం.. నెటిజన్లు స్పందించడం .. లైక్​లు.. షేర్​లు ఇలాసోషల్​ మీడియాలో  నానా రచ్చ జరుగుతుంది.  తాజాగా బస్సులో ఓ కండక్టర్​ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.  ఇంతకూ అతనేంచేశాడనుకుంటున్నారా.. ఈ స్టోరీపై ఓలుక్కేయండి....

పట్టణాల్లో .. మెట్రోపాలిటిన్​ సిటీస్​ లో సిటీ బస్సులు సాధారణంగా రద్దీగా ఉంటాయి.  అలాంటి బస్సుల్లో కండక్టర్లకు టికెట్ ఇవ్వడమే కష్టతరంగా ఉంటుంది.  అయినా సరే ఎంతో కష్టపడుతూ ప్రయాణికులకు టికెట్లు ఇస్తుంటారు. బస్సులో చాలా ఖాళీ ఉన్నా... కూర్చొనేందుకు సీట్లు ఉన్నా..  కొంతమంది ప్రయాణికులు డోర్​ దగ్గరే ఉండి లోపలకు రమ్మన్నా రాకుండా అక్కడే ఉంటారు. తాజాగా తమిళనాడులో సరిగ్గా ఇలాంటిఘటనే జరిగింది, 

వేగంగా వెళ్తున్న బస్సులో కండక్టర్​ టికెట్లు కొడుతున్నాడు. అప్పుడు డోర్​ దగ్గరున్న ఓ ప్రయాణికుడు పట్టు తప్పి బస్సులో నుంచి బయటకు పడబోతాడు.  టికెట్లు ఇస్తూ ఈ ఘటనను గమనించిన కండక్టర్​ సింగిల్​ హాండ్​తో ఆ ప్రయాణికుడిని కాపాడతాడు.   తర్వాత తోటి ప్రయాణికులు అతడిని పడిపోకుండా పట్టుకుంటారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో Rajini @rajini198080 అనే ఖాతానుంచి షేర్​ కావడంతో వైరల్​ అయింది. ఈ వీడియో చూసిన వారు  అంత స్పాంటేనియస్‌గా, ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఎలా సాధ్యమయిందా అని ఆశ్చర్యపోతున్నారు. 

ఇక ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన బస్సు కండక్టర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.. పాసింజర్ ప్రాణాలు కాపాడిన చేతిని ‘దేవుడి హస్తం’గా పేర్కొంటున్నారు. కండక్టర్ ఉద్యోగం ఎంత గొప్పదో ఇప్పటికైనా తెలుసుకోవాలంటున్నారు.ఒక మనిషి ప్రాణాలు కాపాడిన బస్సు కండక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ వీడియోలో ఏముందో మీరూ చూసేయండి.