తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2023 జూలై 03 సోమవారం రోజున చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం చేరారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లుగా సాయంత్రం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ లో వైద్యులు వెల్లడించారు.
ALSO READ:నిమ్స్ లో రోబో సేవలు... దేశంలోనే పెద్ద డయోగ్నస్టిక్ సెంటర్
వైద్యులు ఆయనకు ఎండోస్కోపీ నిర్వహించారు. జూలై 04 మంగళవారం ఉదయం ఆయననుడిశ్చార్జి చేయనున్నట్లుగా వెల్లడించారు. అంతకుముందు స్టాలిన్ రాష్ట్రంలో చేపట్టిన రోడ్లు, వంతెనల పనుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.