కచ్చతీవును ఎందుకడగలే: స్టాలిన్

చెన్నై: దేశాన్ని పదేండ్ల నుంచి పాలిస్తున్న ప్రధాని మోదీ కచ్చతీవు విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు.   శ్రీలంకకు వెళ్లి అక్కడి అధ్యక్షుడిని కలిసినప్పుడు కచ్చతీవు విషయం ప్రధాని మోదీకి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం మోదీ చెన్నయ్ వచ్చినప్పుడు తానొక మెమోరాండం ఇచ్చానని అందులో   మొట్టమొదటిది భారత మత్స్యకారుల హక్కు అయిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని పేర్కొన్నాన్నారు. ప్రధాని కనీసం ఆ మెమోరాండమైనా చదివారా.? లేదా..? అని స్టాలిన్ ప్రశ్నించారు.

ALSO READ:- కేజ్రీవాల్‌కు ఆరోగ్యం క్షీణించడానికి కారణమేంటి ?