
తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు..తమిళనాడు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి..భాషా విధివిధానాలకు సంబంధించి..కేంద్రంతో ఉన్న విబేధాలు, ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి కురియన్ ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటనపై బీజేపీ భగ్గుమంటోంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచుతున్నట్లు చెబుతోంది. సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ ఎందుకు అనేది వివరంగా తెలుసుకుందాం.
రాష్ట్ర స్వయంపతిపత్తిని బలోపేతం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు,సమాఖ్య సూత్రాలను బలోపేతం చేసేందుకు చర్యలపై సూచనలు ఇచ్చేందుకు హై లెవెల్ కమిటీని నియమించింది. శాసన సభ నిబంధన 110 కింద స్వయం పతిపత్తి ప్రకటన చేసిన సీఎం ఎంకే స్టాలిన్..భారత సమాఖ్య వాదానికి మార్గనిర్దేశం చేసే రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు పున సమీక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు.
హైలెవెల్ కమిటీ..
తమిళనాడు స్వయం పతిపత్తి పై వేసిన కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షత వహిస్తారు. ఇతర సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ,ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ కె. అశోక్ వర్ధన్ శెట్టి,రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్-ఛాన్సలర్ ఎం. నాగనాథన్ ఉన్నారు.
►ALSO READ | నేను KCR అంతా మంచి కాదు.. కొంచెం రౌడీ టైప్.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: కవిత
రాష్ట్రాలపై కేంద్రం నియంత్రించే రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, విధానాలను సమీక్షించడం, రాష్ట్ర జాబితానుంచి ఉమ్మడి జాబితాను మార్చబడిన అంశాలను పునరుద్దరించడం కోసం సిఫారసులు, రాష్ట్ర స్వయం పతిపత్తికోసం సంస్కరణలు, రాజమన్నార్, సర్కారియా , పంచి కమిషన్ల వంటి కమిషన్లనుంచి మునుపటి సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై ఈ కమిటీని నివేదిక ఇవ్వనుంది.
అసెంబ్లీని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ.."డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊహించినట్లుగా భారతదేశం ఎప్పుడూ ఏకీకృత రాష్ట్రంగా ఉండాలని కాదు..రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ రాష్ట్రాల అధికారాలు క్షీణిస్తూ వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు ఎప్పటినుంచో రాష్ట్ర స్వయం పతిపత్తిపై పోరాటం చేస్తుందన్నారు. ప్రతి రాష్ట్రానికి సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి అని ఎంకే స్టాలిన్ అన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం, చట్టం, ఆర్థికం వంటి కీలక అంశాలను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మారుస్తోందని రాష్ట్ర అధికారాలను దెబ్బతీస్తోందని ఎంకే స్టాలిన్ ఆరోపించారు.