హీరోయిన్ పెళ్ళికి హాజరైన ముఖ్యమంత్రి. 

ప్రముఖ హీరో నితిన్ హీరోగా నటించిన లై, చల్ మోహన్ రంగా తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితమే. అయితే నటి మేఘ ఆకాష్ ఆ మధ్య నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. 

ఈ క్రమంలో మేఘా ఆకాష్ మరో ప్రముఖ నటుడైన సాయి విష్ణు ని పెళ్లి చేసుకుంది. వీరిరువురి పెళ్లి వేడుక శనివారం రోజున (సెప్టెంబర్ 14) చెన్నైలో ఘనంగా జరిగింది. కాగా మేఘా ఆకాష్ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోపాటు మరింతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

Also Read :- 2024 సైమా అవార్డ్స్ సొంతం చేసుకున్న తెలుగు చిత్రాలు ఇవే

మేఘా ఆకాష్ తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలిజేస్తూ ‘ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్' అని పేర్కొంది. దీంతో కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేఘా ఆకాష్ కి శుభాకాంక్షలు  తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మేఘా ఆకాష్ చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. దీంతో పెళ్లి తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.