
డీలిమిటేషన్ పై మార్చి 22న చెన్నైలో సీఎం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దని ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానం చేసింది. అయితే పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని సీఎం రేవంత్ ప్రతిపాదన పెట్టారు. దీనికి సీఎం స్టాలిన్ అంగీకరించారు.
డీలిమిటేషన్ పై రెండో సమావేశం తెలంగాణలోని హైదరబాద్ లో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు . రెండు రోజుల పాటు సమావేశం నిర్వహిస్తామని.. తేదీలు త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. ఈ సమావేశం తర్వాత అవసరమైతే బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డీలిమిటేషన్ వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాటమని స్టాలిన్ చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని డీలిమిటేషన్పై చెన్నైలో జరిగిన ఆల్‌పార్టీ మీటింగ్లో స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో పార్టీలు ప్రతిపాదించాయి.
ALSO READ | డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు.. సీఎం రేవంత్
ఆల్ పార్టీ మీటింగ్ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించడమే ఉత్తమమని.. మరో 25 ఏళ్ల పాటు లోక్ సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని అన్నారు సీఎం రేవంత్. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని అన్నారు.
దేశ ఖజానాకు దాక్క్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాయని అన్నారు. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయని.. ఉత్తర ప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు వెనక్కి వెళుతున్నాయని అన్నారు. బీహార్ రూపాయి చెల్లిస్తే 9 రూపాయల 22 పైసలు వెనక్కి తీసుకుంటుంటే.. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని అన్నారు రేవంత్. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వెళుతున్నాయని అన్నారు.