చెప్పిన మాట‌‌‌‌ల‌‌‌‌ను చేత‌‌‌‌ల్లో చూపారు.. CM రేవంత్‎పై స్టాలిన్ ప్రశంసలు

చెప్పిన మాట‌‌‌‌ల‌‌‌‌ను చేత‌‌‌‌ల్లో చూపారు.. CM రేవంత్‎పై స్టాలిన్ ప్రశంసలు

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ నియోజ‌‌‌‌క‌‌‌‌వర్గాల పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న‌‌‌‌పై తెలంగాణ అసెంబ్లీలో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి సీఎం రేవంత్ రెడ్డి త‌‌‌‌న మాట‌‌‌‌ల‌‌‌‌ను చేత‌‌‌‌ల్లో నిరూపించార‌‌‌‌ని త‌‌‌‌మిళ‌‌‌‌నాడు సీఎం  స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న‌‌‌‌ను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్​ నాయకత్వంలో రాష్ట్ర అసెంబ్లీలో  గురువారం తీర్మానం చేసిన నేప‌‌‌‌థ్యంలోస్టాలిన్​ఎక్స్​ వేదిక‌‌‌‌గా స్పందించారు. 

న్యాయం, స‌‌‌‌మాన‌‌‌‌త్వం, స‌‌‌‌మాఖ్య స్ఫూర్తిని స‌‌‌‌మ‌‌‌‌ర్థిస్తూ స‌‌‌‌రైన రీతిలో పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న కోరుతూ తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో నెర‌‌‌‌వేరాయ‌‌‌‌ని, ఇది ఆరంభం మాత్రమేన‌‌‌‌ని అన్నారు. హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో ఐక్య కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ స‌‌‌‌మితి రెండో స‌‌‌‌మావేశం నేప‌‌‌‌థ్యంలో మ‌‌‌‌రిన్ని రాష్ట్రాలు అదే బాట‌‌‌‌లో న‌‌‌‌డుస్తాయ‌‌‌‌ని అభిప్రాయ‌‌‌‌ప‌‌‌‌డ్డారు.