అంత అహంకారం మంచిది కాదు

  • తమిళనాడు సీఎం స్టాలిన్​పై గవర్నర్ ఆర్ఎన్ రవి విమర్శలు

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘అంత అహంకారం మంచిది కాదు’ అని సీఎం స్టాలిన్​ను గవర్నర్ రవి ఆదివారం విమర్శించారు. ఇలా వ్యవహరించడం దేశం అంగీకరించదని అన్నారు. స్టాలిన్ ఇటీవల గవర్నర్​పై చేసిన ‘పిల్లచిష్ట’ విమర్శలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 6న తమిళనాడు అసెంబ్లీలో తమిళ రాష్ట్ర గీతం(తమిళ తాయి వాల్తు) పాడడం, జాతీయ గీతం పాడకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు.

ముందు నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం తమిళనాడు అసెంబ్లీలో సభ సమావేశమైనప్పుడు రాష్ట్ర గీతం తమిళ తాయి వాల్తు పాడతారు.. సమావేశాల ముగింపులో జాతీయ గీతం పాడతారు. అయితే గవర్నర్ రవి ఈ నియమానికి ముగింపు పలకాలని రెండు సమయాల్లో జాతీయ గీతాన్ని పాడాలన్నారు. స్పీకర్, సీఎం అంగీకరించకపోవడంతో ఆయన వాకౌట్​ చేశారు.

దీనిపై శనివారం స్టాలిన్​ మాట్లాడుతూ.. గవర్నర్ తమిళ అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘించడం ఒక సంప్రదాయంగా మార్చుకున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో ఉన్నవి చదవకపోవడం, లేనివి జోడించడం చేశారని విమర్శించారు.