సాధారణంగా మ్యాచ్ ఓడిపోతే గల్లీ క్రికెట్ లో సహచర ప్లేయర్ మీద నెట్టేయడం మనకు తెలిసిందే. బాగా ఆడని ప్లేయర్ ను టార్గెట్ చేసి అతని వలనే మ్యాచ్ ఓడిపోయిందని అంటారు. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ లో ఇలాంటివి మనం చూడం. ఎందుకంటే బాగా ఆడలేదని సహచర ప్లేయర్ ను నిందిస్తే అతని ఆత్మ విశ్వాసం దెబ్బ తింటుంది. అయితే రంజీ ట్రోఫీలో భాగంగా తమిళ నాడు కోచ్ సులక్షన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
రంజీ ట్రోఫీ సెమీస్ లో ముంబై మీద తమిళ నాడు ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తమిళ నాడు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్ ఓటమికి కెప్టెన్ సాయి కిషోర్ తీసుకున్న నిర్ణయమేనని అతను అన్నాడు. ఈ మ్యాచ్‌ను మేం ఆట తొలి రోజు ఉదయం 9 గంటలకే ఓడామని.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాల్సిన పిచ్‌పై మా కెప్టెన్ సాయి కిషోర్ బ్యాటింగ్ తీసుకున్నాడని అదే మా ఓటమికి కారణమైందని కులకర్ణి మ్యాచ్ తర్వాత సంచలన కామెంట్స్ చేశాడు.
Also read : IPL 2024: పంత్ ఈజ్ బ్యాక్.. వన్ హ్యాండ్ సిక్సర్‌తో అదరగొట్టాడుగా
నేను ముంబైకి చెందిన వ్యక్తిని. పిచ్ గురించి, ముంబై టీమ్ గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కెప్టెన్ నిర్ణయమే చెల్లుతుంది. సాయి కిషోర్ బ్యాటింగ్ తీసుకోవడం వలనే మేము మ్యాచ్ ఓడిపోయాం. అంటూ తప్పు మొత్తం కెప్టెన్‌పై నెట్టేశాడు కోచ్ కులకర్ణి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు. కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. ముంబై తమ తొలి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడ్డా శార్దూల ఠాకూర్ (109) సెంచరీతో 378 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌటై.. ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
"We should have bowled but the captain had some different instinct"
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2024
Tamil Nadu coach Sulakshan Kulkarni blames the decision at the toss for the team's defeat in the #RanjiTrophy semi-final against Mumbai https://t.co/j7gFf28xor pic.twitter.com/X9ee2Ip7r9