బంగ్లాదేశ్లో చెన్నై పోలీస్ అరెస్ట్.. అసలు ఏం జరిగింది..?

పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో చెన్నైకి చెందిన పోలీస్ అధికారి అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. చెన్నైలోని సెలియనూర్ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న జాన్ సెల్వరాజ్ ను బంగ్లా దేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చికి చెందిన సెల్వరాజ్.. అక్రమంగా బంగ్లాదేశ్ లోకి సరిహద్దుల ద్వారా చొరబడ్డాడని ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. సెల్వరాజ్ అరెస్ట్ ను చెన్నై పోలీసులు ధృవీకరించారు. అయితే సెల్వరాజ్ ఒక్కడే వెళ్లాడా లేదా అతని వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. చెన్నైకి చెందిన పోలీస్ ఆఫీసర్ బంగ్లాదేశ్ లోకి ఎలా ప్రవేశించాడు అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. 

చెన్నై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబారమ్ కమిషనరేట్ పరిధఇలోని సెలియార్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న సెల్వరాజ్  ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ వెళ్లేందుకు మార్చి 19 న రెండు  రోజుల లీవ్ తీసుకున్నాడు. మరో 12 రోజులు మెడికల్ లీవ్ కావాలని పోస్ట్ ద్వారా కోరినట్లు తెలుస్తోంది. 

సెల్వరాజ్ 2004 నుంచి 2009 వరకు డిపార్ట్ మెంట్ లో పనిచేశాడని.. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టాడని సెల్వరాజ్ తో పనిచేసిన పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో సింగపూర్ లో వెళ్లాడు సెల్వరాజ్.  సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత తిరిగి డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ గా తంబారమ్ కమిషనరేట్ పరిధిలో ప్రమోషన్ పొందాడు.