పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్

రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్క రీతిలో నిరసన తెలుపుతున్నారు. లేటెస్ట్ గా   తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా చెయ్యూర్ లో కొత్తగా పెళ్లయిన జంటకు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు  వారి స్నేహితులు. తమిళనాడులో పెరుగుతున్న పెట్రో ధరలకు వినూత్నంగా నిరసన తెలిపామన్నారు దంపతుల స్నేహితులు. తమిళనాడులో లీటర్ పెట్రోల్ కి రూ.110.85 పైసలు, డీజిల్ కి  రూ. 100.94 పైసలు ఉంది.