న్యూఢిల్లీ: ఇండియాలో HMPV పాజిటివ్ కేసుల సంఖ్య 7కి చేరింది. తాజాగా.. తమిళనాడులో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. చెన్నైలో ఒక కేసు, సేలంలో ఒక కేసు నమోదు కావడంతో తమిళనాడులో టెన్షన్ నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. తమిళనాడులో నమోదైన రెండు HMPV పాజిటివ్ కేసులకు సంబంధించి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. తమిళనాడులో HMPV సోకిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు.
చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 7 కేసులు రికార్డయ్యాయి. కర్నాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్ లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. వైరస్ సోకిన 3 నెలల పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా.. మిగతా వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలోనూ నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికి 7 కేసులు రికార్డయ్యాయి. వైరస్ సోకిన 3 నెలల పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా.. మిగతా వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కాగా, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీలేవని పేర్కొంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పింది. వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది.