చెన్నై: తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు తేలడంతో బ్యాన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు. ల్యాబ్ పరీక్షల్లో పీచు మిఠాయి, ఇతర రంగుల స్వీట్ లను పరిశీలించగా రోడమైన్ -బీ అనే కెమికల్‌ను కనుగొన్నారు.
వీటితో తయారు చేసే పీచు మిఠాయి నాసిరకంగా, తినడానికి పనికి రాని విధంగా ఉన్నట్టు గుర్తించారు. రోడమైన్ -బీ తయారీ, విక్రయం, ప్యాకింగ్ ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ కఠిన చర్యలు తీసుకుంటామని సుబ్రమణియన్ హెచ్చరించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కాగా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇదివరకే పీచు మిఠాయిపై నిషేధం విధించారు.