చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలోనే రాష్ట్ర పౌరులకు సరికొత్త ఐడీ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళ పౌరులందరికీ మక్కల్ ఐడీ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నింటినీ 10 అంకెలు గల మక్కల్ ఐడీతో అనుసంధానించాలని భావిస్తోంది.
జనన, మరణ రికార్డులు సహా.. అన్ని వివరాలను మక్కల్ ఐడీ నెంబర్ తో అనుసంధానం చేయనున్నారు. మక్కల్ ఐడీకి అవసరమైన సాఫ్ వేర్ కోసం స్టాలిన్ సర్కార్ టెండర్లు పిలిచింది. తమిళనాడు ఈ - గవర్నెన్స్ ఏజెన్సీ ద్వారా స్టేట్ ఫ్యామిలీ డేటాబేస్ అభివృద్ధి చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.