చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులను గురువారం వెనక్కి పంపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేస్తున్న తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల గవర్నర్లను ఇటీవల సుప్రీంకోర్టు మందలించిన విషయం తెలిసిందే. ఇది "తీవ్ర ఆందోళన కలిగించే అంశం" అని కోర్టు పేర్కొన్న వారం రోజుల తర్వాత తమిళనాడు గవర్నర్ రవి ఈ బిల్లులను వాపస్ చేశారు. ఇందులో ప్రభుత్వ వర్సిటీల వీసీలను నియమించడానికి గవర్నర్ అధికారాన్ని తగ్గించే బిల్లు
అన్నా డీఎంకేకు చెందిన మాజీ మంత్రులపై విచారణకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు ఉన్నాయి. అయితే, గవర్నర్ బిల్లులను వాపస్ చేసిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి మళ్లీ గవర్నర్కు పంపనున్నారు. అయితే, గవర్నర్ కావాలనే బిల్లులను వెనక్కి పంపారని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపించింది.
also read: తండ్రి సెంటిమెంట్ కలిసొస్తదా? .. కంటోన్మెంట్ లో ఇద్దరు మహిళల మధ్యే పోటీ