
తమిళనాడు తమిళనాడు అనటానికే మరో ఎగ్జాంపుల్ ఇది.. రూపాయి సింబల్ కూడా మార్చేసింది డీఎంకే స్టాలిన్ సర్కార్. ఇప్పటి వరకు రూపీకి ఉండే సింబల్ ‘‘₹’’ చూపించటం జరుగుతుంది. ఇక నుంచి ఈ సింబల్ ను మార్చేసింది తమిళనాడు సర్కార్. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమిళ భాషలో ’’రు‘‘ అంటూ రాసుకొచ్చింది. హిందీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తమిళనాడు డీఎంకే సర్కార్ తీసుకున్న మరో కీలక, సంచలన నిర్ణయం ఇది.
சமூகத்தின் அனைத்துத் தரப்பினரும் பயன்பெறும் வகையில் தமிழ்நாட்டின் பரவலான வளர்ச்சியை உறுதி செய்திட…#DravidianModel #TNBudget2025 pic.twitter.com/83ZBFUdKZC
— M.K.Stalin (@mkstalin) March 13, 2025
గత కొన్నాళ్లుగా తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న భాషా యుద్ధ పీక్స్ కు చేరిపోయింది. సై అంటే సై అన్నట్లుగా గత కొన్నాళ్లుగా నడుస్తున్న లాంగ్వేజ్ వార్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అమోదించిన రూపీ సింబల్ నే మార్చే స్థాయికి చేరుకుంది. శుక్రవారం (మార్చి 14)న ప్రవేశపెట్టబోయే 2025/26 బడ్జెట్ లో రూపీ సింబల్ కు బదులుగా తమిళ సింబల్ తో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రాంతీయ భాషలపై హిందీని బలవంతంగా రుద్దేందుకే జాతీయ విద్యా విధానాన్ని (NEP) తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్న డీఎంకే ప్రభుత్వం.. శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్ లో రూపీ సింబల్ ను తొలగించడంతో హిందీపై తమ వ్యతిరేకత ఎంత మేరకు ఉందో గట్టి సంకేతాన్ని పంపింది.
Also Read:-యంగ్ సైంటిస్టును కొట్టిచంపిన పక్కింటి వ్యక్తి..
ఇండియాలో మొత్తం 22 అధికారిక భాషలు ఉన్నాయి. అయితే కరెన్సీ సింబల్ ను దేవనాగరి లిపి లోని ర అనే అక్షరం ‘र’ (ర) ఆధారంగా రూపొందించారు. స్థానిక భాషలకు సంబంధించి ఎలాంటి కరెన్సీ సింబల్ లేకపోవడం తెలిసిందే. అయితే తాజాగా సీఎం స్టాలిన్ తమ భాషలో ఉన్న ‘రు’ అక్షరాన్ని రూపీ సింబల్ ‘‘₹’’ స్థానంలో చేర్చి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సీఎం స్టాలిన్ నిర్ణయంపై బీజేపీ నేత కె.అన్నామలై స్పందించారు. ఇది మూర్ఖత్వం అని మండిపడ్డారు. తమిళనాడు బడ్జెట్ లో రూపీ సింబల్ ను తొలగించడం దారుణమని అన్నారు. ఒక తమిలియన్ రూపొందించిన రూపీ సింబల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినియోగంలో ఉంది. ప్రపంచ దేశాలకు ఇండియన్ కరెన్సీ అంటే రూపీ సింబల్ ద్వారానే తెలుస్తుంది. అలాంటి సింబల్ ను తొలగించడం సరికాదని విమర్శలకు దిగారు.