
మధ్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తోన్న తమిళనాడులోని డీఎంకే సర్కార్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. మద్యం షాపులు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ,ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ వెల్లడించారు. రాష్ట్రంలో దశల వారిగా మద్యం షాపులను ఎత్తివేస్తామని ఆయన తెలిపారు. తొలివిడుతలో భాగంగా 500 మద్యం షాపులను మూసివేస్తామన్నారు. కాగా తమిళనాడులో 5 వేలకు పైగా మద్యం షాపులు ఉన్నాయి.