అధికారంలోకి రాగానే గ్యారంటీ స్కీమ్​లు అమలు : మియ్యప్పన్​

కామారెడ్డి, వెలుగు:  రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే  మొట్ట మొదట ఆరు గ్యారంటీ స్కీమ్​లను పక్కాగా అమలు చేస్తామని  జహీరాబాద్​ పార్లమెంట్ కాంగ్రెస్​పార్టీ అబ్జర్వర్​, తమిళనాడు  లీడర్​ సీడీ మియ్యప్పన్​ చెప్పారు. మంగళవారం ఆయన ఎల్లారెడ్డి నియోజక వర్గంలో పర్యటించారు.  నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల  పార్టీ ప్రకటించిన  గ్యారంటీ స్కీమ్​ల పోస్టర్లు, కరపత్రాలను రిలీజ్​ చేశారు. 

అనంతరం  మీటింగ్​లో  మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి  పార్టీ కట్టుబడి ఉందన్నారు.  టీపీసీసీ జనరల్ సెక్రెటరీ  వడ్డేపల్లి సుభాశ్​రెడ్డి  మాట్లాడుతూ విజయభేరీ సభకు మంచి రెస్పాన్స్​ వచ్చిందన్నారు.  కార్యక్రమంలో  పార్టీ మండల ప్రెసిడెంట్లు, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.