ముంబైలోని జుహులో ఉన్న విరాట్ కోహ్లీ హై లెవెల్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్'లో తాను ఎంట్రీకి తిరస్కరించారని తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వైరల్ వీడియోలో ఆ వ్యక్తి, తెల్లటి చొక్కా, వేష్టి (తమిళనాడులో సాంప్రదాయక వస్త్రధారణ) ధరించి, రెస్టారెంట్ వెలుపల నిలబడి, అతని వేషధారణ కారణంగా ప్రవేశం నిరాకరించబడినందుకు నిరాశను వ్యక్తం చేస్తూ కనిపించాడు.
మైక్రో బ్లాగింగ్ సైట్ 'X'లో ఈ పోస్ట్ కు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని, బాధపడ్డానని వీడియోలో ఓ వ్యక్తి తెలిపాడు. ముంబైకి చేరుకున్న ఆ వ్యక్తి.. (JW మారియట్) లో చెక్ ఇన్ అయ్యాడు. కోహ్లీ అభిమానిగా అతను One8 కమ్యూన్ జుహు బ్రాంచ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ అతని వేషధారణ.. వారి డ్రెస్ కోడ్‌కు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ మేనేజ్‌మెంట్ అతని ప్రవేశాన్ని నిరాకరించింది. నిరుత్సాహానికి గురైన అతను ఖాళీ కడుపుతో ఆ హోటల్ నుంచి వెళ్లిపోయాడు.
తాను సరైన, గౌరవప్రదమైన తమిళ సంస్కృతిని ధరించానని.. యాజమాన్యం మొత్తం తమిళులను, మన సంస్కృతిని అవమానించిందని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. కొన్ని రెస్టో కేఫ్‌లు, రెస్టారెంట్‌లు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందని, సందర్శించేటపుడు అక్కడ ఉన్న నియమాలను తెలుసుకుని వెళ్లడం మంచిదని కొందరు సూచించగా.. మరికొందరు మాత్రం ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం చాలా నిరాశ కలిగిస్తోందని, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నట్టు మరొకరన్నారు. ఇంకొకరేమో దీన్ని చట్టానికి విరుద్దం, వివక్ష అని ఆరోపించారు.
Person with Veshti was not allowed in @imVkohli 's Restaurant
— உன்னைப்போல் ஒருவன் (@Sandy_Offfl) December 2, 2023
Very nice da? pic.twitter.com/oTNGVqzaIz