ఇది జస్ట్ కామెడీ టైమ్.. బీజేపీకి ఉదయనిధి స్టాలిన్ సెటైర్

ఇది జస్ట్ కామెడీ టైమ్.. బీజేపీకి ఉదయనిధి స్టాలిన్ సెటైర్

తమిళనాడులో డీఎంకే ఫైల్స్ విడుదల చేసిన బీజేపీపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. ఇది జస్ట్ కామెడీ, కామెడీ టైమ్ అంటూ సెటైర్ వేశారు. చెన్నైలో ఇఫ్తార్ విందులో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డీఎంకే ఎప్పుడూ ఇస్లాం కమ్యూనిటీకి రక్షణగా ఉంటుందని.. అప్పటి దివంగత మాజీ సీఎం  కరుణానిధి  ఇస్లాం కమ్యూనిటికీ రక్షకుడిగా ఉన్నారన్నారు. ఇప్పుడు తమ నాయకుడు ఎంకే స్టాలిన్ కూడా అదే పని చేస్తున్నారని చెప్పారు. ఇటీవల బీజేపీ విడుదల చేసిన డీఎంకే ఫైల్స్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అని మీడియా ప్రశ్నించగా అదేం లేదని.. ఇది కేవలం కామెడీ టైమ్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

https://twitter.com/ANI/status/1647956262519275520

డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ  ఓ వీడియోను రిలీజ్ చేసింది. సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ,పలువురు మంత్రుల ఆస్తులు 1.34 లక్షల కోట్లని ఆరోపించింది.2006--11 డీఎంకే హయాంలో జరిగిన మెట్రో ఫేజ్ 1 టెండర్‌కు సంబంధించి సీఎం స్టాలిన్ అవినీతికి పాల్పడ్డారని  బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నమళై ఆరోపించారు. చాలా మంది డీఎంకే నేతలకు ఎలక్ట్రోరల్ అఫిడవిట్స్ లో చూపెట్టిన ఆస్తుల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.