తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అరుదైర రికార్డు నమోదైంది. చెపాక్ సూపర్ గిల్లీస్, సేలమ్ స్పార్టాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ బౌలర్ ఒకే బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు. స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ 20వ ఓవర్లో చివరి బంతికి 18 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ 19 ఓవర్లలో 191 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలి ఉంది. ఈ సమయంలో సేలమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్ కు వచ్చాడు. 20వ ఓవర్ వేసిన అభిషేక్..తొలి ఐదు బంతుల్లో 8 పరుగులు ఇవ్వగా..చివరి బంతికి ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఒకే బంతి 18 పరుగులు ఎలా
- 19వ ఓవర్ ఆరో బంతిని అభిషేక్ నో బాల్‌గా వేశాడు. అయితే ఆ బంతికి బ్యాట్స్ మన్ బౌల్డ్ అయ్యాడు. కానీ నోబాల్ కావడంతో ఒక్క రన్ వచ్చింది.
- తర్వాత బాల్ కూడా నోబాల్ వేశాడు. ఈ బంతిని బ్యాట్స్ మన్ సిక్సర్ గా మలిచాడు. దీంతో మొత్తం 8 రన్స్ అయ్యాయి.
- మూడోసారి వేసిన బాల్ కూడా నోబాల్ . ఈ బంతికి బ్యాట్స్ మన్ రెండు పరుగులు తీశాడు. దీంతో మొత్తం పరుగులు 11కు చేరింది.
- తర్వాత వైడ్ బాల్ వేశాడు. దీంతో పరుగుల సంఖ్య 12కు చేరింది.
- లాస్ట్ కు బంతిని వేయగా..దాన్ని బ్యాట్స్ మన్ సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క బంతికే 18 రన్స్ వచ్చినట్లు అయ్యింది.