షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్

షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్
  • 80.90 లక్షల మంది బాధితులు
  • 24.52 లక్షల మందితో నాలుగో స్థానంలో తెలంగాణ
  • పార్లమెంట్​లో వెల్లడించిన కేంద్రం

హైదరాబాద్​, వెలుగు: షుగర్​ పేషెంట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 24.52 లక్షల మంది షుగర్​కు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారని తేలింది. లోక్​సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఇచ్చిన రిప్లైలో ఈ విషయం వెల్లడైంది. నేషనల్​ హెల్త్​ మిషన్​లో భాగంగా రాష్ట్రంలోని 1,75,29,700 మందికి షుగర్​టెస్టులు చేయగా.. అందులో 24,52,989 మందికి షుగర్​ ఉన్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఈ జాబితాలో తమిళనాడు టాప్​లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.

ఆ రాష్ట్రంలో 80.90 లక్షల మంది షుగర్ బారిన పడినట్టు వివరించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 39,81,750 మంది, కర్నాటకలో 28,74,257 మంది, గుజరాత్​లో 24,01,979 మందికి షుగర్ ​ఉందని వెల్లడించింది. ఏపీలో 20,92,505 మందికి షుగర్​ ఉన్నట్టు తెలిపింది. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మందికి షుగర్​ ఉన్నట్టుగా చెప్పింది. అయితే అక్కడ కేవలం 1,25,212 మందికే టెస్టులు చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3.13 కోట్ల మంది షుగర్​కు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.