చెన్నై: తమిళనాట రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గత ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మౌనంగానే ఉన్న మాజీ సీఎం జయలలిత సహచరి శశికళ మెల్లిగా యాక్టివ్ అవుతున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు చేజిక్కించుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. శనివారం చెన్నై టీ నగర్ లోని ఎంజీఆర్ మెమోరియల్లోని జయ సమాధి వద్దకు భారీ ఊరేగింపుతో వెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కలకలం సృష్టించడం తెలిసిందే. అక్కడ ఆవిష్కరించిన శిలాఫలకంపై ‘శశికళ, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ’ అని రాయించుకోవడం ద్వారా తన రాజకీయ ఆకాంక్షలను స్పష్టంచేశారు. జయ హయాం దాకా అన్నాడీఎంకేలో జనరల్ సెక్రటరీయే అత్యున్నత పదవిగా ఉండేది. తర్వాత తాత్కాలికంగా ఆ పోస్టు చిన్నమ్మ శశికళకు దక్కినా, వారసత్వ పోరులో మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు ఆ పదవినే రద్దు చేశారు. దాని స్థానే కో ఆర్డినేటర్, కో కోఆర్డినేటర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పార్టీ నియమావళిని మార్చారు. దీన్ని సవాలు చేస్తూ శశికళ సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. తర్వాత నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు. కాగా, ఎంజీఆర్, జయలలిత సమాధి వద్ద పార్టీ జెండా ఎగరవేసేందుకు, జనరల్ సెక్రటరీగా చెప్పుకోవడానికి శశికళకు హక్కులేదని అన్నాడీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.
తమిళ రాజకీయాలను షేక్ చేస్తున్న శశికళ రీ ఎంట్రీ!
- దేశం
- October 18, 2021
లేటెస్ట్
- మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్
- రీడిజైనింగ్ ఎందుకు.. అంచనాల పెంపు దేనికి?
- సత్యసాయి ఆసుపత్రి సేవలు భేష్: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
- లగచర్ల దాడి వెనుక ఎవరున్నా వదలొద్దు..దోషులను కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాలు
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
- ఫేక్ ఓటర్, ఆధార్ కార్డుల తయారీ ముఠా అరెస్ట్
- మల్లారెడ్డి నమ్మించి గొంతు కోసిండు
- సమష్టి కృషితో దేశానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
- హైదరాబాద్‌లో ఆరో రోజు 1,45,896 కుటుంబాల సర్వే
- కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్‌రావు
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?