హాస్పిటల్ ఫైర్ ఇన్సిడెంట్ పై స్పందించిన స్టార్ హీరో.. మనసు చలించిపోయిందంటూ

హాస్పిటల్ ఫైర్ ఇన్సిడెంట్ పై స్పందించిన స్టార్ హీరో.. మనసు చలించిపోయిందంటూ

తమిళనాడులోని దిండిగల్‌ ప్రయివేట్ హాస్పిటల్ సంఘటనపై తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా "దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 6 మంది ప్రాణాలు కోల్పోయారనే వార్త తెలియగానే  దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంతోపాటు ముందుజాగ్రత్త మార్గదర్శకాలను సక్రమంగా పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

అయితే దిండిగల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ లో గురువారం ఫైర్ యాక్సిడెంట్ కారణంగా 6మంది మరణించారు. ఈ సంఘటనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా రాత్రి 9:30 గంటల సమయంలో మాటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజిన్ కి కాల్ చెయ్యగా 4 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ప్రయత్నం చేశారు. 

కానీ ఇంతలోనే ఉపిరి ఆడక ఒక చిన్నారితో సహా 6మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో ముగ్గురు పేషేంట్లు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఫైర్ ఇన్సిడెంట్స్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పరికరాలు లేకపోవడంతోనే ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే భాదిత కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.