మరోసారి విలన్‌‌గా సూర్య .. ఈసారి ఈ రోలెక్స్ కాస్తా..

మరోసారి విలన్‌‌గా సూర్య .. ఈసారి ఈ రోలెక్స్ కాస్తా..

బాలీవుడ్ యాక్షన్‌‌ సినిమాలు అనగానే వెంటనే గుర్తొచ్చేది ‘ధూమ్’ సిరీస్. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ‘ధూమ్ 4’కి సన్నాహాలు చేస్తోంది. గత చిత్రాలకు కథను అందించిన  ఆదిత్యా చోప్రా.. ప్రస్తుత ట్రెండ్‌‌కు తగ్గట్టుగా నాలుగో భాగానికి కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త కబురు వైరల్ అవుతోంది. 

కోలీవుడ్ స్టార్ సూర్య ఇందులో నటించబోతున్నాడట. అది కూడా నెగిటివ్ రోల్‌‌లో. ఇప్పటికే ఈ విషయమై సూర్యను సంప్రదించగా, అతను ఆసక్తి చూపించినట్టు టాక్.  నిజానికి ‘ధూమ్’ సిరీస్‌‌లో హీరోల కంటే విలన్‌‌ రోల్స్‌‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. గత మూడు సిరీస్‌‌లలో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్ విలన్స్‌‌గా నటించారు. సూర్యకు కూడా నెగిటివ్ రోల్స్ కొత్తేమి కాదు. గతంలో తను హీరోగా నటించిన ‘24’లో విలన్‌‌గానూ నటించాడు. కమల్ హాసన్ ‘విక్రమ్‌‌’లో రోలెక్స్‌‌గా కనిపించింది కాసేపే అయినా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక ప్రచారానికే పరిమితమైన ‘ధూమ్ 4’లో సూర్య క్యారెక్టర్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.