రామ్ చరణ్ సినిమలో విలన్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ స్టార్ హీరో...

రామ్ చరణ్ సినిమలో విలన్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ స్టార్ హీరో...

హీరోగా, విలన్ గా నటించి మెప్పించిన తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితమే. అయితే ఆమధ్య బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెనతో టాలీవుడ్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాడు. దీంతో విజయ్ సేతుపతికి ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. దీంతో విజయ్ సేతుపతి విడుదల 2 సినిమా టీమ్ తో కలసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. 

ALSO READ | నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఇక విభేదాలకు చెక్ పడ్డట్లేనా..!

ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇందులోభాగంగా ఓ రిపోర్టర్ మీరు రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC16 సినిమాలో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయని నిజమేనా అని అడిగాడు. దీంతో విజయ్ సేతుపతి స్పందిస్తూ తాను RC16 లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాను ఈమధ్య కొన్ని టాలీవుడ్ ఫిలిమ్స్ స్క్రిప్ట్స్ విన్నానని కానీ కొన్ని కథలు నచ్చినప్పటికీ డేట్లు కుదరకపోవడం, తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడం తదితర కారణాలతో రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా తమిళ్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన విడుదల మొదటి భాగం మంచి హిట్ అయ్యింది. దీంతో రెండో  పార్ట్ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కి జంటగా తమిళ్ ప్రముఖ హీరోయిన్ మంజు వారీయర్ నటించింది. ఇక తమిళ్ ప్రముఖ నటుడు సూరి పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు.