OTTలోకి జపాన్.. అనుకున్నదానికన్నా ముందే వచ్చేస్తోంది

OTTలోకి జపాన్.. అనుకున్నదానికన్నా ముందే వచ్చేస్తోంది

తమిళస్టార్ హీరో కార్తీ(Karthi) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జపాన్(Japan). రాజు మురుగన్(Raju murugan) దర్శకత్వంలో వచ్చిన హీస్ట్ ఎంటర్టైనర్ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. థియేటర్ లో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.  దీంతో ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.

దీంతో విషయం అర్థమైన జపాన్ మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ముందు డిసెంబర్ రెండవ వారంలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు కానీ.. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి స్ట్రీమింగ్ డేట్ ను ప్రీ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ మూవీ డిసెంబర్ మొదటివారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది చూడాలి.