Pawan Kalyan, Vijay: మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం: విజయ్ తలపతి

Pawan Kalyan, Vijay: మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం: విజయ్ తలపతి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారితో గెలిచాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా.. తమిళ్ స్టార్, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేశారు.. ఎన్నికల్లో భారీ విజయం సాధించి, ఏపీలో జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా నిలిచేలా చేసిన పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం.. అంటూ రాసుకొచ్చారు.

అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా అభినందనలు తెలియజేశారు విజయ్.. ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి నా అభినందనలు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు విజయ్. అయితే విజయ్ ఈ రెండు పోస్టులు తన పర్సనల్ అకౌంట్ నుండి కాకుండా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి చేయడం వీశేషం.