మన బాలయ్యపైనా..!: నందమూరి బాలకృష్ణపై తమిళ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

తమిళ నటి విచిత్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణపై. ప్రస్తుతం ఆమె బాలకృష్ణపై చేసిన కామెంట్స్  సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే. 

నటి విచిత్ర ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 21న జరిగిన ఎపిసోడ్ లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని అడిగారు. నటి విచిత్ర మాట్లాడుతూ..  20 ఏళ్ల క్రితం తనను సినిమా నుండి తప్పుకునేలా చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 2000 సంవత్సరంలో నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. దురదృష్టవ శాస్తు అదే చివరి సినిమా అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. నేను సినిమాలకు దూరమవడానికి కారణం అదే. నేను మర్చిపోదాం అనుకున్నా.. అది నా గుండెల్లో ఇప్పటికీ రగులుతూనే ఉంది. 

ఆ సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఒక 3స్టార్ హోటల్ లో ఉంచారు. ఒకరోజు సాయంత్రం నేను పార్టీలో ఆ సినిమా హీరోను కలిసాను. అతనికి నా పేరు కూడా తెలియదు కానీ.. డైరెక్ట్ గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తరువాతి నా గదికి వెళ్లి పడుకున్నాను.. ఆ తరువాత రోజు నుండి షూటింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. 

ఇక్కడ విశేషం ఏంటంటే.. నటి విచిత్ర.. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. అది భలేవాడివి బాసూ. ఇందులో హీరో బాలయ్య. ఆ సినిమా 2001లో వచ్చింది.. దీంతో నటి విచిత్ర చెప్పింది బాలయ్య గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ మేరకు జాతీయ పత్రికల్లోనూ కథనాలు వస్తున్నాయి.

ALSO READ : బీఆర్​ఎస్​ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు : పొంగులేటి ప్రసాద్ రెడ్డి